![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-59 లో.. శైలు తన ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. బైక్ మీద స్క్రాచ్ పడిందని తన ఫ్రెండ్ షాక్ అవుతుంది. దాంతో నేల్ పాలిష్ తో స్కూటీ మీద రాసి, స్క్రాచ్ ని పోయేలాగా చేస్తుంది శైలు. మరి ఈ పాలిష్ పోతే అని ఫ్రెండ్ అడుగగా పోయినప్పుడు చూసుకుందాంలే పదా అని శైలు అంటుంది. మరోవైపు చక్రి షాపింగ్ నుండి మహా కోసం నైటీ తీసుకొస్తాడు. అయితే దానిని చక్రి వాళ్ళ నాన్న నారాయణ వచ్చి తీసుకొని వెళ్తాడు. ఇక మహా కోసం సర్ ప్రైజ్ తీసుకొచ్చానని చక్రి అంటాడు. ఏంటని మహా అడుగగా తీసుకొస్తానని వెళ్ళేసరికి అక్కడ షాపింగ్ నుండి తెచ్చిన కవర్ ఉండదు. ఇక కాసేపటికి చక్రి వాళ్ళ నాన్న నారాయణ డ్రెస్ వేసుకొని వస్తాడు. అది చూసి మహా నవ్వుతుంది.
ప్రపంచంలో ఏ కొడుకు తన తండ్రికి ఇలాంటి డ్రెస్ వేసుకురాడు అని మహా చెప్తుంది. ఇది మహా కోసం అన్నయ్య తీసుకొచ్చాడని కన్నా అనగానే నారాయణ డిస్సప్పాయింట్ అవుతాడు. విప్పేయాలా అని అనగానే వద్దు మీకు బాగుందని మహ అంటుంది. ఆ తర్వాత మహా బయట ఉంటుంది. చక్రి తన దగ్గరికి వస్తాడు. ఇంకోసారి నాకోసం ఇలాంటివి కొనుక్కొని రావొద్దని మహా అంటుంది. ఎందుకు వద్దు అని చక్రి అనగానే ఎందుకని తీసుకొస్తారు. మనం ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాం అంతే.. నాకు జాబ్ వచ్చాక వెళ్ళిపోతానని మహా అంటుంది. దాంతో చక్రి డిస్సప్పాయింట్ అవుతాడు. ఇక కాసేపటికి మాధవ కిరాణ సరుకులు తీసుకొని వస్తాడు. వాటిని డబ్బాలో సర్దడానికి మహా వస్తుంది. ఇక కన్నా వాళ్ళ ఫ్రెండ్ కన్నాకి కొత్త పౌచ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. అది ఫోన్ కి పట్టట్లేదని చక్రికి ఇస్తాడు కన్నా. దాంతో మీ ఫ్రెండ్ నీ మీద ఇష్టంతో ఇస్తే తీసుకోవాలి కదా అని ఇండైరెక్ట్ గా మాహాని ఉద్దేశ్శించి చక్రి అంటాడు.ఇక అప్పుడే గాయత్రీ వస్తుంది. అదే టైమ్ అనుకొని మహా కోసం చక్రి తీసుకొచ్చిన నైటీని గాయత్రీకి ఇస్తాడు. ఇది నీ కోసం మాధవ అన్నయ్య తెచ్చాడని అనగానే గాయత్రీ మురిసిపోతుంది. ఇక తను థాంక్స్ చెప్తూ వెళ్ళిపోతుంది. ఎందుకు అలా చెప్పావ్ అన్నయ్య అని కన్నా అనగానే అన్నయ్య తను దగ్గరవ్వాలని ఇలా చేసానని అనగానే సూపర్ అన్నయ్య అని కన్నా అంటాడు.
ఇక మహా కోసం చక్రి ఒక ఫేక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాడు. మహా రెడీ అయి మాధవ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక చక్రి తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. మా నాన్న ఊరి నుండి వచ్చాడురా నేను ఆఫీస్ కి రావడం లేదురా అని చక్రితో వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |